రూ.లక్షకు ..70వేలు

May 23,2024 20:51

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఎన్నికల ఫలితాలు దగ్గర కొస్తున్న నేపథ్యంలో మండలంలో పందేలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి జనసేన గెలుస్తుందని రూ.లక్షకు, వైసిపి నుంచి రూ.70వేలు పందెం కాస్తారా అంటూ కూటమి నాయకులు, అభిమానులు తిరుగుతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు తమని గెలిపిస్తాయని వైసిపి వారు చెబుతుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కూటమి మ్యానిఫెస్టో టిడిపి, జన సేన ఉమ్మడి అభ్యర్ధిని గెలిపిస్తుందని కూటమి నాయకులు ఢంకా బజాయించి చెబుతున్నారు. గెలుపు పై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుంటే పందెం రాయుళ్లు ఇదే అదునుగా రూ.1లక్షకు రూ.70వేలు పందెం కాయండని వైసిపి వాళ్లకు సవాల్‌ విసురుతున్నారు. కానీ పందెం కోసం వైసిపి వారు ముందుకు రావడం లేదని చర్చ జరుగుతుంది. ఏదేమైనా జూన్‌ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

➡️