వీల్స్‌ ఇండియా ఉద్యోగాలకు 8 మంది ఎంపిక

Mar 2,2024 14:22 #btech student, #Konaseema

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు 8 మంది వీల్స్‌ ఇండియా కంపెనీ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ సముద్రాల రామారావు తెలిపారు. కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన వీల్స్‌ ఇండియా కంపెనీ ఉద్యోగాలకు రామచంద్రపురం నుండి 14 మంది డిప్లమా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇంటర్వ్యూలకు వెళ్ళగా వారిలో ఎనిమిది మంది ఎంపికైనట్లు ఆయన వివరించారు. వీరికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ 2.4 లక్షలు జీతం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు.

➡️