సిపిఐ పార్టీ 99వ వార్షికోత్సవం

Dec 26,2023 13:23 #99th Anniversary, #CPI Party

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ వార్షికోత్సవం సందర్భంగా … మంగళవారం పుట్లూరు మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి డి.పెద్దయ్య మాట్లాడుతూ … భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 సంవత్సరంలో మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌ నగరంలో ఆవిర్భవించడం జరిగినదన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అనేకమైన పోరాటాలు చేపట్టామన్నారు. అందులో భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కోసం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గని దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు నిర్మించి స్వతంత్రం కోసం ఉద్యమించామన్నారు. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందరికీ సమాన రాజకీయ ఆర్థిక అవకాశం కోసం పోరాటాలు చేసినదన్నారు. అలాగే భూ సంస్కరణల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించినదని తెలిపారు. ఈ ఉద్యమం ఫలితంగానే దేశంలో ఉన్న పేదలందరికీ భూ పంపిణీ ప్రభుత్వాలు చేపట్టిందన్నారు. దళిత, గిరిజనుల సంక్షేమం కోసం వారికి ఆర్థిక, అభివృద్ధి, అవకాశాల కోసం ఉద్యమించామన్నారు. అలాగే ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి మాత్రమే ఉన్నదని అన్నారు.

➡️