గంజాయికు కేరాఫ్‌గా బొబ్బిలి

May 23,2024 20:50

ప్రజాశక్తి- బొబ్బిలి : గంజాయికు బొబ్బిలి కేరాఫ్‌గా మారుతుంది. గంజాయి మత్తుకు యువత బానిసవుతున్నారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరగడంతో యువత బానిసై దాడులకు తెగబడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నా నివారణకు ఎస్‌ఇబి, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.బానిసవుతున్న యువతయువత గంజాయికు బానిసవుతున్నారు. గంజాయి మాఫియా ఒడిషా నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్నచిన్న పొట్లాలు కట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు జరువుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ, గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో చిన్నపిల్లలు సైతం గంజాయికు అలవాటు పడుతున్నారు. గంజాయి మత్తులో కుటుంబంపై దాడిరైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి డౌన్‌లో శ్రీఅంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ వద్ద బుధవారం రాత్రి గంజాయి మత్తులో యువకులు హాల్‌ చల్‌ చేశారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన మహిళలు పట్ల గంజాయి మత్తులో యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడే ఉన్న ఒక కుటుంబం యువతను మందలించింది. దీంతో కక్ష పెట్టుకున్న యువకులు గంజాయి మత్తులో కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరు చిన్నారులు, భార్యాభర్తలపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన నలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దాడిపై పోలీసులకు ఫిిర్యాదు చేశారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు 18 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. గంజాయి నివారణపై ఉదాసీనతగంజాయి నివారణపై పోలీసులు, ఎస్‌ఇబి అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. వీరి ఉదాసీనత వల్ల పట్టణ, గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️