సిద్ధం సభ జయప్రదానికి పిలుపు

Apr 5,2024 22:32
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
సిద్ధం సభ జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-కావలి : బస్సు యాత్ర జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 6వ తేదీ శనివారం కావలిలో ”మేమంతా సిద్ధం” సభకు విచ్చేయచున్న సందర్భంగా అందరూ పాల్గొన్ని సభను జయప్రదం చేయాలని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి కోరారు. సిఎం వైఎస్‌ జగన్‌ రాకను పురస్కరించుకుని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. 6వ తేదీ కావలికి సిఎం వైఎస్‌ జగన్‌ విచ్చేస్తున్న క్రమంలో మేమంతా సిద్ధం పేరుతో కావలి బైపాస్‌ వద్ద ఉన్న వెంగాయగారిపాలెం సమీపంలో విశాలమైన స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాశీస్సులు పొందుకోవడంతో పాటు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని నిండు మనస్సుతో ఆదరించి ఆశీర్వదించేందుకు లక్ష యాబై వేలు పై చిలుకు మంది ఈ సభకు విచ్చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నో బృహత్తరమైన సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆదరించేందుకు అక్కచెల్లెమ్మలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సిఎం రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన ఎన్ని మాయమాటలు చెప్పినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలు ఆధరించి ఆశీర్వదించబోతున్నారని తెలిపారు. మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించబోతుందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️