ఆటోను ఢకొీన్న కారు ..

– ఒకరు మృతి – ముగ్గురికి గాయాలు

ప్రజాశక్తి -కనిగిరి: ఆటోను కారు ఢకొీన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగనగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.అందిన వివరాల ప్రకారం… ఒంగోలు నుంచి కనిగిరి వైపు వస్తున్న కారు కనిగిరి నుంచి కాశిరెడ్డి కాలనీకి వెళ్తున్న ఆటోను ఢకొీట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవాంగనగర్‌కు చెందిన బి.విష్ణు నారాయణ (57) అక్కడికక్కడే మృతిచెందాడు. జి. గురవమ్మ, ఎ. కస్తూరి, రామకష్ణ అనే వారు గాయపడ్డారు. క్షత గాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️