జోరుగా ప్రచారాల హోరు

జగన్‌ను మళ్లీ సిఎంను చేసుకుందాంప్రజాశక్తి-వీరబల్లి రానున్న ఎన్నికల్లో వైసిపికి అండగా నిలిచి జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంను చేసుకుందామని ఎంపి రాజ్యసభ సభ్యులు రఘునాథరెడ్డి, వైసిపి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైసిపి యువ నాయకుడు మదన్‌రెడ్డిలు కోరారు. బుధవారం మండలంలోని తాటిగుంటపల్లి పంచాయితీ, మాజీ ఎంపిపి విజయభాస్కర్‌ రెడ్డి, మదన్‌ రెడ్డి, ఎంపిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి, యువ నాయకుడు వీరనాగిరెడ్డి, ఎంపిటిసి పురు షోత్తంరెడ్డి, సర్పంచ్‌ గోపీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో షికారు పాలెం, కొత్తపల్లి, తాటిగుంటపల్లి, సీతంపేట, గ్రామాల్లో ప్రచారం చేశారు. అనంతరం మాజీ సర్పంచ్‌ లక్ష్మయ్య గహప్రవేశానికి హాజరై అక్కడ విందు భోజనం స్వీకరించి కార్యకర్తలతో మాట్లాడారు. యువకులు, స్థానికులు, మహి ళలు, నాయకులు, కార్యకర్తలు, సైతం ప్రచారంలో పాల్గొ న్నారు. మళ్లీ వచ్చేది వైసిపి పభుత్వమేనని ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అమర్నాథ్‌ రెడ్డి, ఎంపీగా మిథున్‌రెడ్డి మళ్లీ వచ్చి స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపిపి విజయభాస్కర్‌ రెడ్డి, మదన్‌రెడ్డి, వీరనాగిరెడ్డి, ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ గోపీనాథ్‌రెడ్డి, ఎంపి టిసి పురుషోత్తంరెడ్డి, మాజీ ఎంపిటిసి సీతారా మరాజు, జెఎసి కన్వీనర్‌ నరేష్‌స్వామి, సీతంపేట వెంకట రాజు, మాజీ సర్పంచ్‌ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్‌ తిమ్మారెడ్డి, కిషోర ్‌రెడ్డి, వంగిమళ్ళ మధుసూదన్‌ రెడ్డి, సర్పంచ్‌ నాగిరెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్‌ అమర్నాథ్‌ రెడ్డి, వైసిపినాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.తండ్రి గెలుపునకు తనయుడి ప్రచారంరామసముద్రం : మండలంలోని ఉలపాడు, మూగవాడి పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షులు విజరుకుమర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ ఉమ్మడి టిడిపి అభ్యర్థి షాజహాన్‌బాషా తనయుడు జునైద్‌బాషా ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి గతంలో మదనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. తన తండ్రి ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోరుకుంటారని తెలిపారు. గతంలో నియోజకవర్గం అభివద్ధికి ఎంతో కషి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో మరో మారు తన తండ్రిని గెలిపించి ప్రజా సేవకు అవకాశం కల్పించాలని ప్రజలను అభ్యర్తించారు. టిడిపి సూపర్‌ సిక్స్‌ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కలసి కట్టుగా పనిచేసి మదనపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ జండా ఎగరవేయలని కోరారు. కార్యక్రమం లో మాజీ జడ్‌పిటిసి శివశంకర, మాజీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, కష్ణమూర్తి, శ్రీనివాస్‌ మోదీ, నారేపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి ప్రజాశక్తి-నిమ్మనపల్లె వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్య ర్థులను గెలిపించుకోవాలని రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి ఆర్‌జె.వెంకటేష్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చల్లావారిపల్లెలోఎన్నికల ప్రచారాన్ని టిడిపి మాజీ మండల అధ్యక్షులు రాజన్న ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్‌జె.వెంకటేష్‌ పాల్గొన్నారు. చల్లావారిపల్లెలో టిడిపి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి నుంచి పలువురిని టిడిపిలోకి ఆహ్వానించారు. చల్లావారిపల్లెకు చెందిన వైసిపి సీనియర్‌ వైసిపి నాయకులు ఆకుల వెంకటరమణ, మక్బుల్‌బేక్‌, ఆదెన్నలు టిడిపిలో చేరారు. మండలంలోని నాయకులు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఇవ్వలేదని, వైసిపి పార్టీ కార్యక్ర మాలకు మండల నాయకుల నుంచి కనీస సమాచారం కూడా అందించడం లేదని, కార్యకర్తల బాధలను పట్టించు కోవడంలేదని మనస్థాపం చెంది టిడిపిలో చేరినట్లు తెలిపారు. టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ రమణ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి మాత్రమే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయగలుగుతుందని అన్నారు. చల్లావారిపల్లెలో అధికంగా ఉన్న బలిజ, ముస్లిం వర్గాలకు వైసిపి ప్రభుత్వం న్యాయం చేయలేదని ముఖ్యంగా బలిజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. గతంలో చంద్రబాబు బలిజలకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే జగన్మోహన్‌రెడ్డి దానిని తొలగించారని అన్నారు. బలిజలకు, ముస్లింలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో వైసిపి పార్టీ ఘోరంగా విఫల మైందని తెలిపారు. రాయలసీమలో అత్యధిక నియో జకవర్గాలలో బలిజ కులస్తులు ఎక్కువగా ఉన్నారని, కానీ ఒక్క అసెంబ్లీ సీట్లు కూడా బలిజలకు వైసిపి పార్టీ కేటాయిం చలేదన్నారు. చిత్తూరులో ఉన్న ఒక్క సీటు కూడా తీసివే సారని తెలిపారు. బలిజలకు న్యాయం చేసింది టిడిపి, జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ జన సేన పార్టీ పెట్టినందున ప్రభుత్వం కాపులందరినీ శత్రువు లుగా చూస్తోందని, ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుందని పేర్కొన్నారు. దుల్హన్‌ పథకంకు నిబంధనలు విధించారని, మైనారిటీలు దుల్హన్‌ పథకానికి అనర్హులుగా మిగిలిపోయారన్నారు. మైనార్టీలను విదేశీ విద్యకు దూరం చేశారని గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే తిరిగి మైనారిటీలకు పథకాల న్నిటినీ ప్రవేశపెడతారని పేర్కొన్నారు. మదనపల్లెలో షాది మహల్‌ పూర్తి చేయడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 15 సంవత్సరాలుగా మదనపల్లి నియో జకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే లేకపోవడంతో అభివద్ధిలో లోటు కనిపిస్తుందని, వచ్చే ఎన్నికలలో టిడిపి పార్టీ అభ్యర్థి షాజహాన్‌భాషాను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల మిని మేనిఫెస్టోలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటిం చడం జరిగిందన్నారు. మహిళల సంక్షేమానికి, వారి ఆర్థిక అభివద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతను కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త టిడిపి అభ్యర్థుల గెలుపుకు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి మేష రామకష్ణ, మాజీ సర్పంచ్‌లు రమణ, రఫీ, రెడ్డప్ప, ఆస్పత్రి కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీపతి, జగదీష్‌, సుధాకర, జయన్న, ఖాసీం ఖాన్‌, చండ్రాయుడు, జొన్న చంద్ర, టెలిఫోన్‌ రెడ్డప్ప, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.వైసిపితోనే సంక్షేమ పథకాలుప్రజాశక్తి-చాపాడు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసిపి అధికారంలోకి రావాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌.నాగిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అయ్యవారిపల్లె, తిమ్మాయిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథ కాలను అందించామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైసిపికి పట్టం కడితే సంక్షేమ పథకాలు తిరిగి అందు తాయని అన్నారు. వైసిపిని ఆదరించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరు తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి టి.లక్షుమయ్య, మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, జెఎసి మండల కన్వీనర్‌ రామ్మోహన్‌రెడ్డి, వైసిపి నాయకులు శాంతరాజు, జయ రామిరెడ్డి, జయసుబ్బారెడ్డి, పివి.రమణారెడ్డి, వినరు కుమార్‌రెడ్డి, ఎంపిటిసి రమాదేవి, మాదవ్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, ప్రసాద్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, గంగులయ్య, మహేశ్వర్‌రెడ్డి, రామాంజనేయులరెడ్డి, రమేష్‌రెడ్డి, శివ, ఎల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️