ప్రతి విద్యార్థికీ విద్యాకానుక

May 17,2024 20:40

ప్రజాశక్తి-వంగర : నూతన విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికీ విద్యాకానుక అందేలా చూడాలని సమగ్ర శిక్ష సిఎంఒ వి.ఆదినారాయణ సూచించారు. విద్యా కానుక సామగ్రి సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వంగర ఎంఇఒ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిఎంఒ మాట్లాడుతూ విద్యా కానుక మెటీరియల్‌కు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్స్‌, పంపిణీ రిజిస్టర్స్‌ వంటి పలు రికార్డులు నిర్వహించాలన్నారు. ఎంఇఒ-2 ఆధ్వర్యంలో విద్యా కానుక పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఎంఇఒ, సిబ్బంది ప్రతిఒక్కరూ సమన్వయంతో చక్కటి ప్రణాళికతో సక్రమంగా ప్రతి పాఠశాలకు విద్యా కానుక అందేలా సంసిద్ధత కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఆదేశించారు. సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాల్లో పర్యటించినట్లు వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ సిఎంఒ కె.రామారావు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ డి.కిరణ్‌ కుమార్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ డి.తవిటినాయుడు, సిఆర్‌ఎంటిలు రెడ్డి వాసు, మజ్జి గణపతి, బి.సాంబశివరావు. అనురాధ, పోలినాయుడు, పారయ్య పాల్గొన్నారు.

➡️