రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం దుబచర్ల 16వ నెంబరు, జాతీయ రహదారి బ్రిడ్జి పైన బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మఅతి చెందాడు. స్థానికులు, నల్లజర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … జాతీయ రహదారిపై మతిస్థిమితం లేని వ్యక్తి నడిచి వెళుతూ ఉండగా రాజమండ్రి వైపు నుంచి, పురికొస లోడుతో విజయవాడకు వెళుతున్న లారీ వ్యక్తిని ఢకొీట్టింది. లారీ అదుపుతప్పి జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ పై తిరగబడింది. ఈ ప్రమాదంలో పాదచారి అక్కడికక్కడే మఅతిచెందగా లారీ డ్రైవర్‌ క్లీనర్లకు గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లజర్ల పోలీసులు తెలి పారు.

➡️