ప్రజలు బాగుండాలంటే ఎర్రజెండా ఎగరాలి

May 6,2024 21:06

ప్రజాశక్తి – కొమరాడ: ప్రజలు బాగుండాలంటే వారి పక్షాన పోరాడుతున్న ఎర్రజెండా ఎగరాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పోరాడుతున్న సిపిఎం తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎంపి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురం, పెళ్లిగుడ్డు వలస, లక్ష్మీపేట, కంచరపాడు, కోనవలస, విక్రాంపురం పంచాయతీ తమ్మందొరవలస, నందాపురం, కుమ్మరిగుంట పంచాయతీ డంగ భద్ర గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పక్షాన నిలబడి పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రామారావు, సూర్యనారాయణ, లక్ష్మీపురం, రాజ్యలక్ష్మిపురం గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️