రైలుకిందపడి యువకుడు ఆత్మహత్య

Jan 10,2024 12:42 #committed, #Suicide, #train, #young man

చీపురుపల్లి (విజయనగరం) : రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చీపురుపల్లిలో జరిగింది. మేజర్‌ పంచాయతీ పరిధిలోని గులివిందాడ అగ్రహానికి చెందిన కోట్ల నవీన్‌ (28) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. కోట్ల నవీన్‌ వెదుల్లవలస వైన్‌ షాపులో పని చేస్తున్నాడు. అయితే అతడికి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావించారు. ఈరోజు ఉదయం విశాఖ నుండి పలాసా వెళ్లే రైలు కింద పడి నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️