ప్రాణాపాయ స్థితిలో యువకుడు

May 23,2024 21:18

 రక్తదాతల కోసం ఎదురుచూపు : ప్రజాశక్తి-బలిజిపేట మండలంలోని అరసాడ గ్రామానికి చెందిన శివ్వాపు సింహాచలం అనే యువకుడు ఎనీమియాతో బాధపడుతున్నాడు. రక్తం చాలక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడి శరీరంలో 1.4 పాయింట్ల రక్తం మాత్రమే ఉందని వైద్యులు చెబుతున్నారు. రక్తం అత్యవసరం కావడంతో అరసాడ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి చొల్లంగి నీలకంఠం గురువారం ఆస్పత్రికి వెళ్లి యూనిట్‌ రక్తాన్ని దానం చేశాడు. ఆ యువకుడికి ఆరు యూనిట్ల రక్తం అవసరం కాగా, రెండు యూనిట్ల బ్లడ్‌ను దాతలిచ్చారు. మరో నాలుగు యూనిట్ల రక్తం అవసరం కావడంతో కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. రక్తదాతలు స్పందించి 89854 94653 నంబర్‌ను సంప్రదించాలని వారు వేడుకొంటున్నారు.

➡️