ఆదర్శ కమ్యూనిస్టు బగ్గి వెంకటేశ్వర్లు: సంతాప సభలో నాయకులు

బగ్గి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున కృష్ణయ్య, గద్దె చలమయ్య

సత్తెనపల్లి రూరల్‌: క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కార్య కర్తగా, తన తుదిశ్వాస విడిచే వరకూ సిపిఎం నాయకునిగా, రైతు సంఘం మం డల అధ్యక్షులుగా బగ్గి వెంకటేశ్వర్లు పని చేస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య కొనియాడారు. పాముకాటు కు గురై మరణించిన బగ్గి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సిపిఎం నాయకులు, రైతు సంఘం నాయకులు ఆదివారం సంద ర్శించి నివాళులర్పించారు. అనంతరం కందులువారిపాలెంలో సంతాప సభ నిర్వహించారు.సిపిఎం సత్తనపల్లి మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో కందులవారిపాలంలో, సత్తెనపల్లి మండ లంలో, జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం, వృద్ధాప్య పెన్షన్‌ కోసం, మంచినీటి కోసం, కరెంటు కోసం వంటి అనేక పోరాటాల్లో వెంకటేశ్వర్లు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ సైనికుడిగా ఎర్ర చొక్కా ధరించి, ఎర్రజెండా పట్టుకొని ముందు వరసలో నిలబడి అన్ని వర్గాల ప్రజలతో ఆయన కలిసిమెలిసి జీవించ ేవారని అన్నారు. వెంకటేశ్వర్లు జీవితం ఎంతో ఆదర్శనీయమని, ఢిల్లీ మహానగరంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేసిన ఆందోళనలో ఆరు రోజులు పాటు ఆయన పాల్గొన్నారని అన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు

సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ మాట్లా డుతూ వెంకటేశ్వర్లు ఉత్తమ కమ్యూ నిస్టుగా ఆయన చేసిన కషి, మరిచిపోలేని దని కొనియాడారు. సత్తెనపల్లి మండలం లో ఎర్రజెండా రెపరెపలాడటానికి ముఖ్య భూమిక పోషించిన కృషీవలుడు అని కొని యాడారు పార్టీ మహాసభలు జరిగిన సందర్భాల్లో ప్రముఖ పాత్ర పోషించి అందరినీ కలుపుకొని జన సమీకరణ చేసి జయప్రదం చేయడంలో ఆయన పాత్రను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి నాయకులు దుగ్గి నాగేశ్వర రావు, కోట నాయక్‌ పలు గేయాలను ఆలపించారు. సంతాప సభలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి బాలకృష్ణ, ఏపూరి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంజిమాల రవి బాబు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని, రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ, సిపిఎం సత్తెనపల్లి పట్టణ కార్యదర్శి ధరణికోట విమల, పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి సిఐటియు నాయకులు షేక్‌ సిలార్‌, ఎం.హరిపోతురాజు, చేనేత కార్మిక సం ఘం నాయకులు కట్ట శివ దుర్గారావు , అనుముల వీరబ్రహ్మం, యువజన సంఘం నాయకులు జడ రాజ్‌ కుమార్‌ రైతు సంఘం మండల కార్యదర్శి ఎం .నరసింహారావు పార్టీ మండల కమిటీ సభ్యులు దుగ్గి మేరమ్మ, ఫణిదం శాఖ కార్యదర్శి వంగర తులసీరామ్‌, కమిటీ సభ్యులు రావూరి పూర్ణచంద్రరావు, భగత్‌ విద్యార్థి సంఘం నాయకులు అమూల్య కందుల వారి పాలెం గ్రామ శాఖ కార్యదర్శి చలువది లక్ష్మీనారాయణ, గ్రామ పార్టీ నాయకులు వెంకటనారాయణ, సత్యవతి , వెంకయ్య, సాయిబా పాల్గొన్నారు.

➡️