కూటమి గెలుపుతోనే అభివృద్ధి : అదితి

May 10,2024 21:33

ప్రజాశక్తి – విజయనగరం కోట:  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కూటమి విజయం చాలా అవసరమని కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలో భగవాన్‌ నగర్‌, నటరాజ్‌ కోలనీ, పద్మావతి నగర్‌, గాయత్రినగర్‌, 48వ డివిజన్‌ గాజులరేగ, విటి అగ్రహారం, దాసన్నపేట, నవాబ్‌పేటలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రశాంతతకు నిలయమైన విజయనగరాన్ని డ్రగ్స్‌కు, గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఈ ఎన్నికలలో కూటమికి మద్దతు తెలిపి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడును ఎమ్‌పిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కె.గ్రీష్మ, మాజీ సర్పంచ్‌ సూర్యకుమారి, 35వ డివిజన్‌ మాజీ కౌన్సిలర్‌ రొంగలి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, టిడిపి మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు, కాళ్ల గౌరీ శంకర్‌ పాల్గొన్నారు.

➡️