ఆదరించండి.. అభివృద్ధి చేస్తా: అజితారావు

ప్రజాశక్తి-త్రిపురాంతకం: యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. శనివారం ఆమె త్రిపురాంతకం మండలంలోని జి ఉమ్మడివరం, వెంగాయపాలెం, గుట్లపల్లి, పాత ముడివేముల, కొత్త ముడివేముల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి, వైసీపీ పార్టీలు యర్రగొండపాలెం నియోజకవర్గానికి చేసిందేమీలేదన్నారు. గెలిచిన అభ్యర్థులు తమ ఆస్తులు పెంచుకోవడానికి కష్టపడ్డారే కానీ ప్రజల కష్టాలు నెరవేర్చలేదన్నారు. ప్రజల కష్టాలు నెరవేరాలన్నా, నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సుగుణ, మస్తాన్‌, రువ్వల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️