కోలాహలంగా ఆలం జన్మదిన వేడుకలు-అభిమానుల రక్తదానం

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ఆలం క్యాంపు కార్యాలయం వద్ద టిడిపి జిల్లా నాయకులు వెంకట్‌ వకుళ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఆలం వెంకట్‌ నరసనాయుడు జన్మదిన వేడుకలు సోమవారం ఆయన అభిమానుల మధ్య కోలాహాలంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా ఆలం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పలువురు ఆలం అభిమానులు ఆనందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న సదుద్దేశంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో మరికొందరు ఇలాంటి రక్త దాన శిబిరాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. రక్తదానం చేయడానికి వచ్చిన అభిమానులకు ఆలం వెంకట నరసానాయుడు, ఆలం నాగార్జున భోజనం ఏర్పాట్లు చేశారు. అనంతరం పలువురు ఆలం అభిమానులు ఆయనతో కేక్‌ కట్‌ చేయించి బాణాసంచా కాల్చారు.. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆలం వెంకట నరస నాయుడు కఅతజ్ఞతలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో టిడిపి మండల కన్వీనర్‌ ఎర్ర నాగప్ప, టిడిపి నాయకులు ఆలం నాగార్జున, చంద్రబాబు, నర్సాపురం రవికుమార్‌, జయరాం, పిఎల్‌ లక్ష్మీనారాయణ, హుస్సేన్‌ పీరా, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️