ఇవిఎంల కేటాయింపు

Apr 13,2024 21:07

ప్రజాశక్తి – నెల్లిమర్ల : స్థానిక ఇవిఎం గోదాంలో నిర్వహిస్తున్న ఇవిఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్‌ ద్వారా ఇవిఎంలను వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. దీనిలో నియోజకవర్గాలకు వచ్చిన ఇవిఎంల సీరియల్‌ నెంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి, స్కానింగ్‌ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ఈ ప్రక్రియనే కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఇవిఎమ్‌ల నోడల్‌ ఆఫీసర్‌ బి.ఉమాశంకర్‌, డిఆర్‌డిఎ పీడీ ఏ.కళ్యాణ చక్రవర్తి, తహశీల్దారు ధర్మరాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ, డిఆర్‌డిఎ, ఆర్‌డబ్ల్యుఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️