ఆధునిక హంగులతో ఐటిడిఎ

అధికారులతో మాట్లాడుతున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను అందంగా ముస్తాబు చేశారు. ఆదునీకరణ పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు. ఐటిడిఏ కార్యాలయం, ప్రాంగణం ఆదునీకరణ పనుల అనంతరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ ఆదివారం ప్రారంభించారు. ప్రాజెక్టు అధికారి చాంబరు, ఐటిడిఏ సమావేశ మందిరం, కారు పార్కింగ్‌, ప్రాంగణంలో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయడంతో ఐటిడిఏ కార్యాలయం అందంగా కార్పోరేట్‌ కార్యాలయాలను మించి ఆకర్షనీయంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఏ అధికారులకు, సందర్శకులకు కారు పార్కింగ్‌ ఏర్పాటు చేసామని చెప్పారు.కార్యాలయం బయట బైక్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేసామన్నారు. ప్రాంగణంలో అందమైన మొక్కలు వేసి అహ్లదకరంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. ఐటిడిఏ ప్రాంగణం చీకటిగా ఉంటుందని గుర్తించి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసామన్నారు. జెండా వందనం కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక దిమ్మను నిర్మించామని చెప్పారు. 25 కార్ల వరకు కారు పార్కింగ్లో నిలుపుదల చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఐటిడిఏ కార్యాలయాన్ని తక్కువ సమయంలో సుందరంగా తీర్చిదిద్దిన గిరిజన సంక్షేమ శాఖ దేముళ్లును పిఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి ఎన్‌.అశోక్‌, ఎఎఓ శ్రీనివాస్‌ కుమార్‌, పద్మాపురం గార్డెన్‌ ఉద్యానవన అకారి బొంజుబాబు, ఐటిడిఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️