ఉత్సాహంగా మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌

ట్రోఫీని అందజేస్తున్న ఎఎస్‌పి

ప్రజాశక్తి-జి.మాడుగుల: జిల్లా ఎస్పీ తూహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు మద్దిగరువులో యువహౌ మెగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఏఎస్పి ధీరజ్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఉచితంగా నడిపి స్తున్న బస్‌ ను మద్దిగరువు నుండి బోయితీలి వరకు పెంచారు. ఈ బస్‌కు ఎఎస్పి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తదనంతరం బస్‌లో ఆయన మద్దిగరువు వరకు ప్రయాణించి, సురిమెట్ట గ్రౌండ్లో యువహౌ మెగా వాలీబాల్‌ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ కు మొత్తం 59 టీమ్స్‌ పాల్గొనాయి, విన్నర్‌గా లింగేరిపుట్టు టీం, రన్నర్‌గా ఎగవ మండిబ టీములు నిలిచాయి.వీరికి నగదు బాహుమానంతో పాటు ట్రోఫీలు అందజేశారు.

➡️