‘నీట్‌’ అవకతవకలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరసన

'నీట్‌'

మళ్లీ నిర్వహించాలి : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గీతాకృష్ణ

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ : దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాత పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు జి.గీతాకృష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం నర్సీపట్నంలో నీట్‌ పరీక్షలో అక్రమాలపై నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గీతాకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. రెండు చోట్ల నీట్‌ నిర్వహణలో అక్రమాలు జరిగాయని అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దీనిపై విచారణ జరిపిస్తామనిగానీ, అభ్యర్ధులకు న్యాయం చేస్తామనిగానీ ప్రకటించడకపోవడం దారుణమన్నారు. తక్షణమే నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. నిరసన ర్యాలీలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌, డివిజన్‌ సభ్యులు భూషణ్‌, మను, మోహన్‌, దుర్గ పాల్గొన్నారు

.యలమంచిలి :వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్‌’ పరీక్షల్లో పెద్ద ఎత్దున జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ యలమంచిలి డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.బాలాజీ మాట్లాడుతూ నీట్‌లో 67 మంది విద్యార్ధులకు 720 మార్కులు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నీట్‌ పరీక్షల్లో అవకతవకలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు జోక్యంతో రెండు చోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వ ఒప్పుకుందన్నారు. ఎన్‌టిఎను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం తగదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేశవ, శ్రీను, అప్పలరాజు, విజరు, గణేష్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారునీట్‌ అవకతవకలపై నర్సీపట్నంలో చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ నిరసన ర్యాలీ

➡️