‘ఉపాధి’ కూలి చెల్లించాలి

వినతి పత్రాన్ని ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండలంలోని ఉపాధి హామీ కూలీలకి కూలి సొమ్ము జమ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం.శ్రీను, మండల వైస్‌ ఎంపీపీ పాటుబోయి సత్యనారా యణలు డిమాండ్‌ చేసారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీల సొమ్ము తక్షణమే చెల్లించాలని నిరసన చేపట్టారు. ఎంపీడీవో కిరణ్‌ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా మండల వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఉపాధి కూలి పనులు చేసి 90 రోజులు దాటుతున్నా ఖాతాల్లో సొమ్ము జమ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️