ఎక్కడికక్కడ నిర్బంధం

పాడేరులో గృహ నిర్బంధంలో అప్పలనర్స

 

సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పోలీసు, ప్రభుత్వ తీరును సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ ఖండించింది. పాడేరు: అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లికి గురువారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి పి.అప్పల నర్శ ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తెల్ల వారు జామున 3 గంటలకే పాడేరులో ఆయన ఇల్లును పోలీసులు చుట్టు ముట్టారు. దీనిపై అప్పలనరస ఫోన్లో తన ఇంటి వద్ద నుంచి విలేకరులతో మాట్లాడుతూ, చింతపల్లిలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఆదివాసీ నాయకుల పై గృహ నిర్భందం సరికాదని అన్నారు. సి.ఎం ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ పై మౌనం వీడి చట్టబద్ధత కల్పించడంపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతగిరి:జెడ్పీటీసీ దీసరి గంగరాజును గురువారం ఇంటి వద్ద తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు చుట్టి ముట్టి నిర్బంధిచారు ఈ సందర్భంగా ఆయన స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రశ్నిస్తారనే భయంతో హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ మోహన్‌ రెడ్డి గృహనిర్బంధాలతో భయభ్రాంతులను చేయడం మానుకోవాలన్నారు. గిరిజన సమస్యలపై ప్రశ్నించే గొంతు పై ఉక్కు పాదంతో అణిచి వేస్తారా మీకు చిత్తశుద్దుంటే జిఓ 3 రిజర్వేషన్‌ కు చట్టబద్ధత కల్పించి ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్‌ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ మాతృ భాష వాలంటరీలకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలన్నారు.పివిటీజి లకు అంత్యోదయ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు.పది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచరు,్ల హెల్ఫర్లకు కనీసం వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు.చింతపల్లి:గిరిజన సమస్యలపై సిఎం జగన్‌ కనీసం ప్రస్తావించకుండా గిరిజన ప్రాంతంలో సభ పెట్టడం ఎందుకని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ ప్రశ్నించారు. ఆయనను హౌస్‌ అరెస్టు చేయడంపై స్పందించారు. గిరిజనుల గొంతుక నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాజంగి లో సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయని అదుపులో తీసుకున్నారు.అరకులోయ రూరల్‌:ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ ను ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా బాలదేవ్‌ మాట్లాడుతూ, గిరిజన సంఘం నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేసి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. పెదబయలు:గిరిజన సంఘం పూర్వ అధ్యక్షులు బోండా సన్నిబాబును గురువారం ఉదయం 5 గంటలకు ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. స్థానిక పోలీసులు ఇంటిపై దాడీ చేసి చుట్టుముట్టి నిద్రపోతున్న సన్నిబాబును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.చలిలో నడిపించుకొంటూ పోలీసు స్టేషన్‌ కు తరలించారు.ఈ సందర్బంగా సన్నిబాబు మాట్లాడుతూ, అరెస్టులకు భయపడేది లేదన్నారు.సిపిఎం నేత సూరిబాబు గృహ నిర్బంధంకొయ్యూరు : చింతపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం సిపిఎం జిల్లా నాయకుడు ఎస్‌.సూరిబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను సూరిబాబు తీవ్రంగా ఖండించారు.

➡️