ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యాన ధర్నా

ప్రజాశక్తి-పాడేరు:ఉద్యోగ,ఉపాధ్యాయుల దీర్ఘ కాలిక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గురువారం పాత బస్టాండ్‌ ఆవరణలో ఏపీటీఎఫ్‌ సంఘం ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీటిఎఫ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు రావుల జగన్‌ మోహనరావు మాట్లడుతూ, ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో 117 జీవోను తీసుకువచ్చి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేస్తుందని విమర్శించారు. పిఎఫ్‌, డి ఎలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి. శ్యాంసుందర్‌ మాట్లాడుతూ, 30శాతం ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు కిల్లు. పోతురాజు, జిల్లా కార్యదర్శి శెట్టి.శాంతకుమారి, చిన్నారావు, మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిళ్లు. పోతురాజు భైరవ మూర్తి నాయుడు పాల్గొన్నారు.

➡️