గిరిజనులకు తప్పని తిప్పలు

క్యూలో ఉన్న లబ్ధిదారులు

ప్రజాశక్తి-పెదబయలు:రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా తీసుకు వచ్చిన ఆన్లైన్‌ విధానంతో గిరిజనులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. మారుమూల గిరిజన గ్రామాలలో ఇంటర్నెట్‌ సిగల్‌ లేక పోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు.మండలంలోని రూఢకోటలో నెట్‌ సిగల్స్‌ సరిగ్గా లేక పోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్‌ విధానంతో ఇటు ప్రజలకు, అటు రేషన్‌ డీలర్లకు కష్టాలు తప్పలేదు.

➡️