గిరిజనుల వినూత్న నిరసన

రోడ్డు గోతి వద్ద నిరసన చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి -అనంతగిరి:తమ పివిటిజీ గ్రామలకు రోడ్డు సౌకర్యం పూర్తి చేసినట్లు సంబందిత అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని తెల్లరపాడు గ్రామ గిరిజనులు రోడ్డు గోతిలో నిరశన చేపట్టారు. అనంతరం గ్రామస్తులు రాజు, డొంబు, బాస్కరావు లు మాట్లాడుతూ,అనంతగిరి పంచాయతీ తేనెపుటు, తెల్లరపాడు పివిటిజీ గ్రామాలకు ప్రభుత్వం రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. పనులు మధ్యలో నిలిపి వేయడంతో భారీ వర్షాలకు రోడ్లన్నీ గోతులుగా. ఏర్పడ్డాయని తెలిపారు.మెటల్‌ రోడ్డు వేసినట్లుగా రికార్డులు సృష్టించి డబ్బులు విత్‌ డ్రా చేశారని ఆరోపించారు.

➡️