గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి

శంకుస్థాపన చేస్తున్న కలెక్టర్‌, పిఒ, ఎమ్మెల్యే, తదితరులు

ప్రజాశక్తి-పాడేరు : గిరిజన ప్రాంతం సర్వతో ముఖాభివృధ్దికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు. బుధవారం ఐటిడి ఏ కార్యాలయ ఆవరణలో జరిగిన పలు అభివృద్ది పనులు శంఖుస్థాపన కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌తో కలిసి అరకు, పాడేరు నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, అరకు, పాడేరు నియోజక వర్గంలో రూ.రూ.55 లక్షలతో నిర్మించిన 11 హాత్‌ బజార్లు, రూ.144 లక్షల వ్యయంతో నిర్మించిన 9 వ్యవసాయదారుల ఉత్పత్తి కేంద్రాలు, రూ.50 లక్షల తో నిర్మించిన భీమవరంలో నిర్మించిన పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ యూనిట్‌, రూ.32.45 లక్షలతో నిర్మించిన ఐదు షేడ్‌ నెట్‌ వ్యవసాయ యూనిట్లకు ప్రారంభిం చామన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ. 210 లక్షల వ్యయంతో పాడేరు మండలం కించూరు నుండి వల్లాయి గ్రామం వరకు తారు రోడ్డు, కించూరు నుండి బొంజంగి వరకు రూ. 75 లక్షలతో తారు రోడ్డు, బడిమెలనుండి వల్లాయి గ్రామం వరకు రూ.160 లక్షల వ్యయంతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసామన్నారు.ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ మాట్లాడుతూ, రూ.4.45 కోట్లతో రహదారులకు శంకుస్థాపనలు చేసామన్నారు. 2018లో మంజూరై హాత్‌ బజార్లు, గత ఏడాది మంజూ రైన షేడ్నైట్స్‌ పనులను అతి తక్కువ కాలంలో పూర్తి చేసారని ఇంజనీరింగ్‌ అధికారులను అభినందించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో రూ.50 లక్షల వ్యయంతో బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌ ను నిర్మిస్తున్నామన్నారు. పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. బడిమెల, వల్లాయి రోడ్లు నిర్మించడం శుభ పరిణామ మన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్‌. ప్రభాకరరావు, ఎం. వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇఇలు డి. వి.ఆర్‌.ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, డిఇ అనుదీప్‌, పాడేరు ఎంపిపి ఎస్‌.రత్నకుమారి, డి.ఆర్‌.డి.ఏపి డి వి.మురళి తదితరులు పాల్గొన్నారు.సికిల్‌ సెల్‌పై అవగాహన కల్పించండిపాడేరు: సికిల్‌ సెల్‌ ఎనిమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత కోరారు. సికిల్‌ సెల్‌ ఎనిమియా నివారణ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సికిల్‌ సెల్‌ ఎనిమియా ప్రచార రధాలను బుధవారం ఐటిడిఏ కార్యాలయం వద్ద పాడేరు ఎంఎల్‌ఎ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటిడిఏ పిఓతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సికిల్‌ సెల్‌ ఎనిమియా నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి సొనారి రత్నకుమారి, హుకుంపేట ఎంపిపి రాజబాబు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️