టిడిపి హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి

చింతపల్లిలో ప్రచారం చేపడుతున్న మణికుమారి, నాయకులు

ప్రజాశక్తి-చింతపల్లి:మండలంలో గురువారం టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు ఆధ్వర్యాన కొమ్మంగి, ఎర్రబొమ్మలు, లంబసింగి, తాజంగి పంచాయతీలోని పలు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి మణికుమారి మాట్లాడుతూ, తెలుగు దేశం ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి బాట వేసిందన్నారు. కొట్టగుల్లి సుబ్బారావు మాట్లాడుతూ,గిరిజన గ్రామాల్లో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయగా ఈ ప్రభుత్వం దాన్ని తీసేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఎంపీటీసీ సత్యనారాయణ, ముర్లా సత్యనారాయణ చల్లంగి సురేష్‌, బూత్‌ కన్వీనర్‌ ముర్ల రాంబాబు పాల్గొన్నారు.పాడేరు: మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీ సంతబయలులో తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజక వర్గం నాయకుడు కిల్లు వెంకట రమేష్‌ నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు అడపా నరసింహమూర్తి నాయుడు, మాజీ సర్పంచులు మూడవ వెంకటేశ్వర్లు, బాకురు. బాలరాజు, సిదరి తౌడయ్య, మజ్జి భీమేష్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు సోభ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️