డోన్ల వినియోగం పై అవగాహన

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి – చింతపల్లి:- గిరి రైతులకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీ కేంద్రాల ద్వారా రాయితీపై అందిస్తున్న డ్రోన్లను గిరి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ దురియా పుష్పలత కోరారు. స్థానిక పంచాయతీ కేంద్రం వద్ద సోమవారం డ్రోన్లు వినియోగంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ డ్రోన్లు ఖరీదు 6 లక్షలు రూపాయలు ఉండగా అందులో రైతులకు 40 శాతం రాయితీపై అందిస్తామన్నారు. ఈ డ్రోన్‌తో సమయం ఆదా చేసుకోవచ్చని, ఎనిమిది నిమిషాలలో ఒక ఎకరం పిచికారి పనులు పూర్తి చేయవచ్చన్నారు. ఎరువులు, విత్తనాలు డ్రోన్ల ద్వారా చల్లు కోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వి నగర్‌ వైద్యాధికారి రాజా రవీంద్ర చౌదరి, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️