తుపాన్‌ నష్టాన్ని అంచనా వేయించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరు: తుఫాను కారణంగా పాడేరు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయించి, బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడంలో ప్రజాప్రతినిధులంతా నిమగం కావాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సూచించారు. పాడేరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సర్పంచులు, ఎంపీటీసీలతో ఆమె సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పంటలకు ఎంతెంత నష్టం జరిగిందన్న వివరాలను అంచనా వేయడంలో అధికారులను అప్రమత్తం చేసే బాధ్యతను ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు తీసుకోవాలని సూచించారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడే అండగా నిలవాలని ఆయన సూచించారు.

➡️