నేడు చింతపల్లిలో సిఎం జగన్‌ పర్యటన

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న మంత్రి అమర్‌

ప్రజాశక్తి -చింతపల్లి:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 21న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అమర్‌ పరిశీలించారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి 21న ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి సీఎం నివాసం నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో 9:50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 10.30 గంటలకు చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చౌడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకుంటారు. అక్కడి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని స్మాల్‌ టెక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 20 గంటలకు ప్రత్యేక సభ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అక్కడ 40 నిమిషాలు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతారు. అనంతరం 12:30 గంటలకు సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడే దాదాపు 30 నిమిషాలు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. అనంతరం 1:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ, పలువురు అధికారులు పర్యవేక్షించారు.

➡️