పట్టువిడవని అంగన్‌వాడీలు

అడ్డతీగలలో ఆందోళన చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరసనలు శుక్రవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం, అధికారులు అంగన్‌వాడీలను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ పట్టు వీడని అంగన్‌వాడీలు ఆందోళనలు కొనసాగించారు. పాడేరు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.సుందర్‌రావు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం నాల్గవ రోజు కొనసాగింది. అంగన్వాడీల సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు ప్రజల నుంచి విశేషంగా మద్దతు లభిస్తుంది. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు కొనసాగిస్తున్న నిరసన దీక్ష శిబిరం వద్ద వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు నిరసన దీక్షలో పాల్గొన్నారు. నిరసన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని సిఐటియు ఇతర ప్రజా సంఘాలు అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అల్లూరీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.డుంబ్రిగుడ: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు మండల కేంద్రంలోని హైవే రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తక్షణమే సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేపడతామని పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షురాలు కే.కొండమ్మ మాట్లాడుతూ, ప్రస్తుత ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కే.సత్యవతి, అంగన్వాడీలు పాల్గొన్నారు.ముంచింగిపుట్టు: స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. అంగన్వాడీలు నల్ల బ్యాడ్జీల ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. బకాయి పడ్డ బిల్లులు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు.అనంతరం మండల ఎంపీడీవో కిరణ్‌ కుమార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకురాలు కౌసల్య, మండల అధ్యక్షురాలు విజయ, కార్యదర్శి ఈశ్వరి, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, అంగన్వాడి సంఘం గౌరవ అధ్యక్షులు సత్యవతి, అధ్యక్షులు పార్వతి, కార్యదర్శి ఎస్‌.ఈశ్వరమ్మ, అంగన్వాడీలు మౌలమ్మ సుజాత కాంతమ్మ పాల్గొన్నారు..హుకుంపేట:స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) కార్యాలయ ఆవరణలో సమ్మె కొనసాగింది. ముఖానికి నల్ల రైబన్లు కట్టుకొని నిరసన తెలిపారు.ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు టి క్రిష్ణారావు, కే.రామారావు మాటాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగల గొట్టడం దుర్మార్గమన్నారు. సమ్మె ను నీరుగార్చడానికి కుట్ర చేస్తుందన్నారు.అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు అప్పలకొండమ్మ, కృష్ణవేణి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రామారావు, కృష్ణారావు పాల్గొన్నారు. అనంతగిరి: తమ న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన దీక్ష శుక్రవారం నటితో నాలుగు రోజులకు చేరుకుంది ఈ దీక్ష కార్యక్రమంలో ఎంపీడీవో హర్షిత్‌ రాజ్యం సిడిపిఓ సంతోషం కుమారి సందర్శించి అంగనవాడిలా తాళాలు ఇవ్వాలని కార్యకర్తలకు బ్రతిమళ్లపటికి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని ముకుత కంఠంగా తెలిసి చెప్పారు అయితే కొన్నిచోట్ల పై అధికారుల ఒత్తిడిలో మేరకు సచివాలయం వెలుగు సిబ్బంది అంగన్వాడి తాలలు పగలగొట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్‌ కాలేదు ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకురాలు సిసిఎస్‌, కళావతి పి, మంజుల పాల్గొన్నారు విఆర్‌.పురం:అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా అంగన్వాడీల సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా విఆర్‌.పురం మండల రేఖపల్లిలో అంగన్వాడీలు శుక్రవారం నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ అంగనవాడిల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు ఎం.రాజేశ్వరి సున్నం రంగమ్మ, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.కూనవరం : అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు శుక్రవారం సీపీఎం నాయకులు మద్దతు తెలియచేశారు. అనంతరం అంగన్వాడీలు మండలంలోని కూనవరం, టేకులబోరు గ్రామాల్లో భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అన్నపూర్ణ, లక్ష్మి ప్రసన్న, లలిత, అర్జమ్మ, సీఐటీయూ నాయకులు కొమరం పెంటయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.అడ్డతీగల : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు బి.నిర్మల, బేబీ రాణి మాట్లాడారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, ఎంఆర్‌పిఎస్‌, తెలుగుదేశం నాయకులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం ఉదయం సచివాలయం సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల తాళాలు తీయడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులు, అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీలేరు : జీకే వీధి మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జికే వీధి తహశీల్దారుకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి.సత్యనారాయణ ఆధ్వర్యాన అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎల్‌ సత్యవతి, ఎస్‌.అప్పల నరసింహ, దయా వెంకటి, జ్యోతి, భవాని, యశోద, కుమారి పాల్గొన్నారు.రాజవొమ్మంగి : అంగన్వాడీలు శుక్రవారం నల్లచీరలు ధరించి స్థానిక ఎంపిడిఓ, తహాశీల్దార్‌ కార్యాలయాలు వద్ద నిరసన తెలిపారు. స్థానిక అల్లూరి జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు కుంజం జగన్నాథం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, చర్చలకు పిలిచి బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె.వెంకటలక్ష్మి, చిన్ని కుమారి, రమణి, సుందరమ్మ, సత్యవతి, రాజేశ్వరి, మంగా పాల్గొన్నారు.కొయ్యూరు : మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని టిడిపి నాయకులు ఎంవివి.ప్రసాద్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు, యూనియన్‌ నాయకులు అచ్చియమ్మ, ముత్యాలమ్మ, అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.తాళాలు పగలగొట్టడాన్ని అడ్డుకున్న అంగన్వాడీలుమారేడుమిల్లి : నాలుగవ రోజుకు సమ్మె సందర్భంగా అంగన్వాడీలు మండలంలో తాసిల్దార్‌ కార్యాలయం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మండలంలోని కట్రవాడ, పూజారి పాకలు అద్దరి వీధిలో అంగన్వాడి సెంటర్ల తాళాలను సచివాలయ మహిళా పోలీసు, పగలగొడుతుండగా అంగన్వాడీలందరూ అక్కడ చేరుకొని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్లో సచివాలయం మహిళా పోలీస్‌, వాలంటీర్లపై ఫిర్యాదు చేశారు. మరో వైపు అంగన్వాడి దీక్షకు వెలుగు యానిమేటర్లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మారేడుమిల్లి మండలం, వై రామవరం మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️