ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

ప్రభుత్వ తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

ప్రజాశక్తి – విలేకర్ల యంపాడేరులో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు త్రాంగంసమస్యలను పరిష్కరించాలని అల్లూరి జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. కేంద్రాల తాళాలు తెరిచేందుక అదికారులు వెళ్లడంపై నిరసన చేపట్టారు. ఇటువంటి చర్యలకు పూనుకోవడం తగదని నినాదాలు చేశారు. పాడేరు:తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి పై అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించకుండా పలుచోట్ల అధికారులు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న వైఖరిపై అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలుచోట్ల అంగన్వాడి వర్కర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తెరిపించిన అంగన్‌వాడి కేంద్రాల్లో సరుకులు, తదితర సామగ్రి భద్రత పై అధికారులే బాధ్యత వహించాలని అంగన్వాడీలు హెచ్చరించారు. పాడేరులోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మెలో భాగంగా శనివారం అంగన్వాడీల నిరసన దీక్ష కొనసాగించారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నల్ల రిబ్బన్లతో కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వం తీరుపై అంగన్వాడీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు మండల తహసిల్దార్‌ వంజంగి త్రినాధరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న ముంసమ్మె డిమాండ్లు న్యాయమైనవని రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన మాట తప్పిందని తెలిపారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని అప్పటివరకు తమ దశలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు. ముంచింగిపుట్టు: స్థానిక ప్రాజెక్టు కార్యాలయం అంగన్వాడీల సమ్మె కొనసాగింది. అంగన్వాడీల సంఘం గౌరవ అధ్యక్షురాలు సత్యవతి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బందితో అంగన్వాడి కేంద్రాల తాళాలు అక్రమంగా బద్దలు గొట్టేందుకు ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సమ్మెకు మండల వైస్‌ ఎంపీపీ1 పాటు పోయి సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి పాంగి భీమరాజు సంపూర్ణ మద్దతు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్‌ను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. కనీస వేతనం రూ.26000 చెల్లించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు మంజూరు, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల సంఘం అధ్యక్షులు పార్వతి, కార్యదర్శి ఎస్‌.ఈశ్వరమ్మ, అంగన్వాడీలు మౌలమ్మ, సుజాత, కాంతమ్మ, అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యానిమేటర్ల సంఘీభావం.డుంబ్రిగుడ:సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న సమ్మె ఐదవ రోజు కొనసాగింది. మండలంలోని యానిమేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.బాలకృష్ణ శనివారం ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గత ఎన్నికల ముందు అంగన్వాడి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే కొండమ్మ, కే.సత్యవతి, జి.పవిత్ర, అంగన్వాడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పెదబయలు: మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల ఆందోళన కొనసాగింది. సమస్యలు రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు టి.రాజమ్మ, కార్యదర్శి సుశీల, మంగ, పద్మ పాల్గొన్నారు.రంపచోడవరం:తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధం అంగన్వాడీ సంఘాల పిలుపు మేరకు అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరింది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన శనివారం ఆందోళన కొనసాగించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కబడ్డీ, ఇతర ఆటపాటలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్‌ జిల్లా కోశాధికారి కె.వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్‌ లీడర్‌ బి.సింగారమ్మ సెక్టార్‌ లీడర్‌ ఎం సత్య వేణి, ప్రాజెక్ట్‌ కోశాధికారి కే అంజమ్మ, సెక్టర్‌ లీడర్‌ కే మంగయమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్స్‌, మినీ అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.చింతూరు : చింతూరు ఐటిడిఎ వద్ద అంగన్వాడీలు చేపట్టిన ఐదో రోజు ఆందళనను మాజీ జెడ్పిటిసి, మహిళా సంఘం నాయకురాలు ముర్రం రంగమ్మ ప్రారంభించారు. డొంకరాయి ఎంపీటీసీ కరక వెంకటరమణ, మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పల్లపు రాములు, గిరిజన సంఘం నాయకులు కారం సుబ్బారావు, పెనుబల్లి వెంకయ్య అంగన్వాడీలు ముచిక జయ, సరియన్‌ లలిత, రాజకుమారి, సున్నం, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండలంలోని రేఖపల్లి మండల కేంద్రంలో వందల సంఖ్యలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని శనివారం సిపిఎం నాయకులు పూలమాలు వేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడిచిపెట్టి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్యనారాయణ, సిరాపు తాతబాబు, ప్రకాష్‌రావు, హజరత్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రాజేశ్వరి, నాగమణి, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.అడ్డతీగల : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీలు ఐదో రోజు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని, మౌనవ్రతం పాటిస్తూ నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దంగేటి సత్తిబాబు, టిడిపి మండల అధ్యక్షుడు జర్త వెంకటరమణ, సీనియర్‌ నాయకులు జుజ్జువరపు శ్రీనివాస్‌ చౌదరి, ప్రధాన కార్యదర్శి వడ్డీ రాంబాబు, మేడిశెట్టి శ్రీనివాస్‌, చదువు రామకృష్ణ, అబ్బాయి రెడ్డి, నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి నిర్మల, బేబీ రాణి పాల్గొన్నారు.పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు రాజవొమ్మంగి : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈనెల 12 నుండి సమ్మె చేస్తుండగా, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు అంగన్వాడి కేంద్రాల తాళాలను పగలగొట్టడంపై అంగన్వాడీలు శనివారం రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు కె.వెంకటలక్ష్మి, గిరిజన సంఘం మండల అధ్యక్షులు కె జగన్నాథం, డివైఎఫ్‌ఐ నాయకులు టి శ్రీను తదితరులు మాట్లాడుతూ ఐసిడిఎస్‌, సచివాలయం సిబ్బంది మహిళా పోలీసులు దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రాల్లో విలువైన వస్తువులు, రికార్డులు, సరుకులు పోతే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తక్షణ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.భిక్షాటనమారేడుమిల్లి : మారేడుమిల్లిలో తహశీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు శనివారం తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ మారేడుమిల్లి పురవీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. దీనికి ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి, వై రామవరం అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️