ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

కారులో తనిఖీలు చేపడుతున్న పోలీసులు

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి పాడేరు వంతాడపల్లి చెక్పోస్ట్‌ వద్ద పోలీస్‌ తనిఖీలు నిర్వహించారు. 50 వేలకు మించి నగదు తో ప్రయాణిస్తున్న వ్యక్తులను తనిఖీలు చేసి వారి నుంచి నగదు స్వాధీనపరచుకొని సీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మైదాన ప్రాంతం నుండి పాడేరుకు ద్విచక్ర వాహనం లో సరైన పత్రాలు లేకుండా 2,70,000 నగదు తో వస్తుండగా పోలీస్‌ తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఈ సొమ్మును స్వాధీనం పరుచుకుని సీజ్‌ చేశారు.

➡️