నీటిలో పంట

నీటిలో పంట

ప్రజాశక్తి -కోటవురట్ల:ఇటీవల తుఫాను కారణంగా చౌడువాడ గ్రామంలో అత్యధికంగా సాగు చేసిన మిరప తోట దెబ్బతింది. సుమారుల 100 ఎకరాల్లో మిరప తోట సాగు చేపట్టారు.ఇంతవరకు ఎకరాకు రూ.40,000 వరకు ఖర్చు చేశామని పూర్తిగా తోట నీటిలో మునిగి పోవడంతో మొక్కలు ఎందుకూ పని రాకుండా పోయాయని రైతులు ఆవేదన చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు వచ్చి వెళ్లారని, తమకు ఎటువంటి హామీ ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, నాయకులు తమకు న్యాయం చేయాలని కోరారు.

➡️