సిసి రోడ్డును పరిశీలించిన సర్పంచ్ పూనం సరోజిని

ప్రజాశక్తి-విఆర్ పురం: మండలంలోని రేఖపల్లి పంచాయతీలో గల గొల్లగూడెం గ్రామంలో ఎన్ ఆర్ ఈ ఎస్ నిధుల నుంచి 9 లక్షలు రూపాయలు శాంక్షన్ అవటంతో సిసి రోడ్డు వేయడం ప్రారంభించారు. ఆ సీసీ రోడ్డుని గురువారం రోజున సర్పంచ్ వారితో పాటు సిపిఎం బృందం పరిశీలించారు. సర్పంచ్ సరోజినీ మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వర్షాలు పడితే ఈ రోడ్డు పైన ప్రజలు నడిచే పరిస్థితి లేదని గ్రామస్తులు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సి సి రోడ్డు శాంక్షన్ చేపించామని తెలిపారు. ఈ రోడ్డు వేయటం ద్వారా ప్రజలకు ఎటు వెళ్లాలన్న ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. ఈ రోడ్డు నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వదని అవకతవకలు పాల్పడవద్దని, సిసి రోడ్డు త్వరగా పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టకి సూచించటం జరిగింది. ప్రజలు మాట్లాడుతూ సర్పంచులు ఎంతోమంది వచ్చి పోయారు కానీ ఈ రోడ్డు విషయంలో పట్టించుకోలేదని మీరు మా బాధలు చూసి ఈ రోడ్డు జంక్షన్ చేయించారని సిసి రోడ్డు వేస్తున్నందుకు గ్రామస్తులు సర్పంచ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జిల్లా కమిటీ సభ్యులు పూనం, సత్యనారాయణ మండల నాయకులు పంకు, సత్తిబాబు హజరత్. సచివాలయం సిబ్బంది ఇంజనీరింగ్ తరుణ్ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

➡️