రెండో రోజుకు సిహెచ్‌డబ్ల్యుల నిరహార దీక్ష

Feb 16,2024 00:17 #v
నిరహార దీక్ష

 

ప్రజాశక్తి-పాడేరు:ఆశా వర్కర్లుగా తమను మార్చాలని కోరుతూ అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్లో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌) (సి హెచ్‌ డబ్ల్యూ ) లు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను గత కొన్ని ఏళ్లుగా వేడుకుంటున్నారు.. తమ మొర అధికారులు ఆలకించడం లేదని ఆవేదనతో ఐటీడీఏ ముందు ఇటీవల కాలంలో దపదపాలుగా ధర్నాలు చేస్తూ తమ గోడు వెళ్ళబోసుకురు. మరోసారి ఐటీడీఏ ముందు సిహెచ్‌డబ్ల్యూలు చేపట్టిన మూడు రోజుల సామూహిక నిరాహార దీక్ష గురువారం రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎల్‌ సుందరరావు, ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మంగమ్మ మాట్లాడుతూ, పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో ఉన్న 36 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశా వర్కర్లుగా గుర్తింపబడని సుమారు 687 మంది సిహెచ్‌బ్ల్యూలు పనిచేస్తున్నామని, తామంతా ఆశా వర్కర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. అయినా తమకు వేతనాలు చెల్లింపులో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిహెచ్డబ్ల్యులకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదని అన్నారు. సిహెచ్‌డబ్ల్యులకు కేవలం నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. సిహెచ్‌డబ్ల్యూలను తక్షణమే ఆశా వర్కర్లుగా గుర్తించి పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనిఫామ్‌ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.దాసమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కిల్లో పద్మ, కిల్లు పార్వతి, చింతపల్లి కొయ్యూరు, జీకే వీధి, పాడేరు, హుకుంపేట మండలాల సిహెచ్డబ్ల్యూలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️