రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పెదబయలులో పరిశీలిస్తున్న సన్నిబాబు

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగంమిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులు, ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పంటలను సిపిఎం, రైతు, ప్రజా సంఘాల నాయకులు గురువారం పరిశీలించారు. పంటలను నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. ్శ వర్గ సభ్యుడు సురేంద్ర. డుంబ్రిగుడ: మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం కారణంగా వివిధ పంటలు కోల్పోయిన గిరి రైతులకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే.సురేంద్ర డిమాండ్‌ చేశారు. మండలంలోని కండ్రుం పంచాయితీ జాకర వలస గ్రామంలో గురువారం సిపిఎం బృందం సందర్శించి, తుపాన్‌ కారణంగా కోల్పోయిన వరి, రాజ్మా, వలిసెలు, చోళ్ళు, చిక్కుడు పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ తుపాను కారణంగా పంటలతో పాటు పలు రకాల కూరగాయల పంటలు నీట మునిగి పూర్తిగా పాడైపోయాయన్నారు. చేతి కంది వచ్చిన పంట వర్షాల కారణంగా పాడవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోకపోతే రైతులకు ఆకలి చావులు తప్పదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకుడు టి సూర్యనారాయణ, కే.రామచందర్‌ పాల్గొన్నారు.చింతపల్లి:అల్లూరి సీతారామరాజు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి పాంగి ధనుంజరు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని తాజంగి పంచాయితీలోని బలబద్రం, తాజంగి, గత్తం పాకలు తదితర గ్రామాల్లో పర్యటించి వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాస్తో కూస్తో సాగునీరు అందుతున్న రైతులు మాత్రమే వరి పంటలు వేసుకున్నారని, తుఫాను ప్రభావంతో దెబ్బతిందన్నారు. కుప్పలు వేసుకున్న వరి కూడా తడవడంతో మొలకలు వస్తాయని, దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. గతంలో నష్టానికి తగ్గ పరిహారం ప్రభుత్వం చెల్లించలేదన్నారు.పెదబయలు:మండలంలోని సీతగుంట పంచాయతీ రోగుల పేట గ్రామంలో పంట పొలాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బోండా సన్నిబాబు మాట్లాడుతూ,మండల పరిధిలో సుమారు 1000కి పైగా రైతులు వరి పొలాలు కోల్పోయారన్నారు. అధికారులు పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 25000 వేలు నష్టపరిహారం చెల్లించి, పెదబయలును కరువు మండలంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సాగిన ధర్మాన్న పడాల్‌, మండల కమిటీ సభ్యులు బొండా గంగాధరం, బొండా ఆనందు, బోండా భీమన్న పాల్గొన్నారు, హుకుంపేట: మండలం తాడిపుట్టులో ఓ రైతుకు చెందిన వరి పంటను ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు పరిశీలించి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామంలో పంట నష్టాన్ని అధికారులు చేపట్టక పోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విఆర్‌ పురం:తుపాన్‌ కారణంగా మండలంలో నీట మునిగిన పంటలను ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం జిల్లా, మండల నాయకులు గురువారం పరిశీలించారు. రైతులను పరామర్శించి వారికి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ రైెతులు అప్పులు చేసి, లక్షల రూపాయలు పంటలపై పెట్టుబడి పెట్టారని, తుపాన్‌ రూపంలో వారికి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. బాధిత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు పంటలు ఈ-కాప్‌లో లేవని, నష్టపరిహారం ఇవ్వడం కుదరదని చెప్పడం దారుణమన్నారు. అటువంటి కుంటి సాకులు చెబితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు కారం సుందరయ్య, పంకు సత్తిబాబు, గుండిపూడి లక్ష్మణరావు, సిరపు తాతబాబు, వీర్ల నాగేశ్వరరావు, నాల్పారపు ప్రకాశరావు, సోడి మల్లయ్య, సిహెచ్‌ సుబ్బారావు, రైతులు వెంకన్న బాబు పాల్గొన్నాడు.రాజవొమ్మంగి : మండలంలో వర్షాలకు నీట మునిగి తీవ్ర నష్టాలు చవి చూసిన రైతులకు ప్రభుత్వం రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, లోదొడ్డి సర్పంచ్‌ లోతా రామారావు డిమాండ్‌ చేశారు, లోదొడ్డి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో గురువారం సిపిఎం బృందం పర్యటించింది. లోదొడ్డి, పూదేడు, కేశవరం, పాకవెల్తి గ్రామాలలో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేలిన రమేష్‌, పొత్తురు సత్యనారాయణ, పోలిశెట్టి లావరాజు, గోము బుల్లబ్బాయి, ఎమ్‌.మురళి, ఎమ్‌ సురేష్‌, ఎల్‌.అర్జున్‌, జె అబ్బాయి, చెల్లారావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.చింతూరు : మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో తుఫాన్‌ వల్ల నష్టపోయిన మిర్చి, పత్తి, వరి, మినుము, నువ్వు పంటలను సిపిఎం చింతూరు మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లం సుబ్బమ్మ ఆధ్వర్యాన గురువారం పరిశీలించారు. వర్షం, గాలులకు మిర్చి పంట పూర్తిగా పడిపోయి నష్టం జరిగిందని, చేతికి అందివచ్చిన పత్తి, వరి పంటలు నీటిపాలయ్యాయని రైతులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుబ్బమ్మ మాట్లాడుతూ పత్తి, మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు, వరికి ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సవలం కన్నయ్య, సవలం దేవసయ్య, లక్ష్మి, ముత్తయ్య, నాగులు పాల్గొన్నారు.కొయ్యూరు : మండలంలోని రాజేంద్రపాలెంలో దెబ్బతిన్న పంటలను సిపిఎం మండల నాయకులు ఎస్‌ సూరిబాబు గురువారం పరిశీలించారు. తక్షణమే అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️