విద్యతోనే బంగారు భవిష్యత్తు

Jan 26,2024 00:05
పాఠశాలను ప్రారంభిస్తున్న పిఒ

: పిఒ ప్రజాశక్తి-డుంబ్రిగుడ:బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ సూచించారు. మండలంలోని కండ్రూం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ 3 లక్షలతో ఆధునికరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. పాఠశాలకు గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని, బొమ్మలు వేయించాలని గ్రామస్తులు కోరగా వెంటనే పనులు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కె.వేణుగోపాల్‌, ఎఈ అభిషేక్‌, సర్పంచ్‌ కిముడు హారి, ఎంపీపీ ఎస్‌ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️