విద్యార్థిని సాయి ప్రీతికి సత్కారం

సత్కరిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఏకలవ్య గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని సాయి ప్రీతి అర్చరీ విభాగంలో బంగారు పతకాలు సాధించడంతో ఎమ్మెల్యే పాల్గుణ అభినందించారు. అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థినిని సత్కరించి అభినందించారు. ఆయన మాట్లాడ్డారు ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులను ప్రభుత్వం నడిపిస్తుందన్నారు. ఉన్నత చదువులతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. జెడ్పిటిసి సభ్యురాలు జానికమ్మ, మండల అధ్యక్షుడు మలేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️