13వ రోజుకు రిలే దీక్షలు

రిలే దీక్షలు

ప్రజాశక్తి-హుకుంపేట:గిరిజనేతరుల అక్రమ కట్టడాలు కూల్చేయాలని మండల కేంద్రంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారానికి 13వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా హుకుంపేట వైస్‌ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు మాట్లాడుతూ, మండల కేంద్రంలో గిరిజనేతరురాలు బుడ్డిగా కొండమ్మ అక్రమ నిర్మాణాలు ప్రభుత్వం వెంటనే కూల్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు పాల్పడుతున్నా గిరిజనేతరులపై రెవెన్యూ అధికారులు అడ్డుకట్టు వేయకపోవడం సరికాదన్నారు. అక్రమణ దారులపై కేసులు నమో చేయాలన్నారు. పలుమార్లు గిరిజన సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో పునాది లెవెల్‌లోనే నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో నేడు ్ట రెండు మూడు భవనాలను గిరిజనేతరురాలు చేపట్టిందన్నారు.ప్రభుత్వ స్థలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉన్నప్పటికీ గిరిజనేతరులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని, అందరూ సంఘటితమై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజనులు కే.నూకరాజు, శంకర్‌, పోతురాజు, కొండబాబు, ప్రసాద్‌ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️