25న సెల్‌ టవర్‌ ప్రారంభం : పిఒ

Jan 22,2024 23:51
స్థానికులతో మాట్లాడుతున్న పిఒ

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఈనెల 25న ఎయిర్టెల్‌ సెల్‌ టవర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వి అభిషేక్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన లైగండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 300 సెల్‌ టవర్లను ప్రారంభి స్తారన్నారు.సెల్‌ టవర్‌ నిర్మాణంతో మారుమూల గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వేణుగోపాల్‌., ఏఈ అభిషేక్‌, ఎంపీడీవో ఉషారాణి పాల్గొన్నారు.

➡️