30వ రోజుకు అంన్‌వాడీల నిరసన 

అడ్డతీగలలో 30 ఆకారంలో నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే అంన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 30వ రోజు కొనసాగింది. డుంబ్రిగుడలో థింసా నృత్యం చేశారు. మిగిలిన చోట్ల ఆందోళనలు చేపట్టారు. పాడేరు: కనీస వేతనం, గ్రాడ్యుటి చెల్లించాలని కోరుతూ సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వ నిర్బంధాల పై బుధవారం నిరసన చేపట్టారు. సమ్మెలో భాగంగా ఐటిడిఏ వద్ద అంగన్వాడీలు నిరవధిక దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌. సుందర్రావు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, అంగన్వాడీలు చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా పక్క దారి పట్టించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా షోకాజ్‌ నోటీసులు ఇస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జయ, అంబికా, చిన్నారి, సత్యవతి, దేవి, లక్ష్మి, భారతి, విమల పాల్గొన్నారు.థింసా నృత్యం చేస్తూ ఆందోళనడుంబ్రిగుడ:సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లు మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద బుధవారం గిరిజన సంప్రదాయమైన గిరిజన సంప్రదాయమైన థిసా నృత్యాన్ని ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో ఆందోళన కొనసాగించారు.పెదబయలు:మండల కేంద్రంలో సమ్మె 30వ రోజు కొనసాగింది.ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామంటూ అంగన్వాడీ యూనియన్‌ నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు. ముంచింగిపుట్టు:స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరం వద్ద అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్‌వాడీలకు ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మద్దతు తెలిపారు. మెమోలు జారీ చేసి అంగన్వాడీలు విధుల్లో చేరాలని, లేనిపక్షంలో ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌, సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు, అంగన్వాడి మండల యూనియన్‌ నాయకులు కాంతమ్మ, ఈశ్వరమ్మ, సుజాత పాల్గొన్నారు.చింతపల్లి:మండల కేంద్రంలో పాత బస్టాండ్‌ వరకు అంగన్వాడి యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు పెంటమ్మ, రాములమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.మధ్యాహ్న భోజనం కార్మికులు మద్దతు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెక్టార్‌ నాయకురాలు నీలమ్మ, లక్ష్మి, ఇందు, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పీ.లక్ష్మి పాల్గొన్నారు. అనంతగిరి:అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నేటికీ 30 రోజులకు చేరుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు లేదని స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనం రూ.26 వేల హామీ ఏమైందని ప్రశ్నించారుజఈ కార్యక్రమంలో టోకురు సిపిఎం సర్పంచ్‌, సిఐడియూ మండల కార్యదర్శి కె. మొస్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.,నాగులు. అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు లక్ష్మీ, మంజుల, కళావతి, చిలకమ్మ పాల్గొన్నారు.రాజవొమ్మంగి:స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా అంగన్‌వాడీలు దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు సర్కిల్‌గా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నిర్మల మాట్లాడుతూ, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా తగ్గేది లేదని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు, యూనియన్‌ నాయకులు సిహెచ్‌ కుమారి, కె.వెంకటలక్ష్మి, ఎల్‌ సత్యవతి, నూక రత్నం, రమణ, రమణి, మంగ, సుందరమ్మ, రత్నం, మేరీ పాల్గొన్నారు.రంపచోడవరం : మండల కేంద్రంలో అంగన్వాడీ దీక్షలు బుధవారం నాటికి 30వ రోజుకు చేరాయి. వీరి ఆందోళనకు ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, రైతు సంఘంతో పాటు పలు సంఘం నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పల్లపు వెంకట్‌, కె.శాంతిరాజు, గిరిజన సంఘం నేత ఈ.సిరిమల్లిరెడ్డి, రైతు సంఘం నేతలు ఐవి.సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్‌, పల్లబోలు రమణ, షర్మిల, 108 ఉద్యోగుల సంఘం నాయకులు పుష్పరాజు. నాగేశ్వరరావు. గిరిజన సంక్షేమ శాఖ వర్కర్లు యూనియన్‌ నాయకులు కారం శ్రీను, జి.వెంకటేశ్వరరావు, టి.వరలక్ష్మి, రత్నం పాల్గొన్నారు.మారేడుమిల్లి : మండలంలో అంగన్వాడీల సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరింది. వీరి ఆందోళనకు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మద్దతు పలికారు. యూనియన్‌ నాయకులు రత్నకుమారి, అంగన్వాడీలు పాల్గొన్నారు.అడ్డతీగల : మండల కేంద్రంలో అంగన్వాడీల నిరసన శిబిరాన్ని సిఐటియు, గిరిజన సంఘం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఈ సిరిమల్లె రెడ్డి, పి.రామరాజు, అంగన్వాడీ నేతలు బి నిర్మల, కె రాణి, పి రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.చింతూరు : మండల కేంద్రంలో 30వ రోజు ఆందోళనను యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సవలం వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్‌ కోషధికారి కామేశ్వరి, నాయకులు జయ, కన్నకదుర్గ, ముత్తమ్మ, లలిత, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండలంలోని రేఖపల్లిలో అంగన్వాడీల సమ్మె 30వ రోజుకు చేరింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ జిల్లా సభ్యులు సున్నం, రంగమ్మ మండల కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. విఆర్‌.పురం : కూనవరం మండల కేంద్రంలో అంగన్వాడీల చేపట్టిన దీక్షా శిబిరాన్ని సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఐ. వెంకటేశ్వర్లు బుధవారం సందర్శించి సంఘాభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పిఎన్‌ఎం నాయకులు సుబ్బారావు, కన్నారావు, సుమన్‌, యూనియన్‌ నాయకులు లలిత, ప్రసన్న, సోడే అజ్జమ్మ, తెల్ల ముత్తమ్మ, ముచ్చక అరుణ, సోడే అజ్జమ్మ, మడం అన్నపూర్ణ పాల్గొన్నారు.సొమ్మసిల్లి పడిపోయిన అంగన్వాడీ వర్కర్‌రాజవొమ్మంగి : స్థానిక ఆర్‌అండబి అతిథిగృహం ఎదురుగా అంగన్వాడి వర్కర్లు చేపట్టిన దీక్ష శిబిరం వద్ద లాగరాయి గ్రామానికి చెందిన లాగరాయి అంగన్వాడి కేంద్రం-1 వర్కరు కె మంగ బుధవారం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. రోజు లాగానే మంగ సమ్మె శిబిరానికి చేరుకొని నినాదాలు చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన తోటి వర్కర్లు ఆమెకు సఫర్యాలు చేసి, అనంతరం ఆసుపత్రిలో చికిత్స అందించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల పరామర్శించి ఎటువంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

➡️