రాజవొమ్మంగిలో బంద్ విజయవంతం 

Bandh successful in Rajavommangi

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : జీవో నెంబర్ 3,1/70 చట్టం, గిరిజన హక్కులు,చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటూ గిరిజన సంఘం,ఆదివాసీ జెఏసి ఆద్వర్యంలో ఆదివారం తలపెట్టిన ఏజెన్సీ బంద్ రాజబొమ్మంగిలో విజయవంతం అయ్యింది, బంద్ నేపథ్యంలో వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూత పడ్డాయి. వాహన రాకపోకలు గంటలు తరబడి నిలిచిపోయాయి. గిరిజనులు రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3, ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులతోనే నింపాలని బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, ఆదివాసి జేఏసీ నాయకులు కుంజం జగన్నాథం, కొండ్ల సూరిబాబు,పాండవుల సత్యనారాయణ, ప్రవీణ్, వజ్రపు అప్పారావు, గంపా నాగరాజు, తాము సూరిబాబు,ఈకా అచ్చిరాజు,ఈకా పెంటన్నదొర, రామకృష్ణ, బి రామకృష్ణ,సిపిఎం నాయకులు పొత్తూరి సత్యనారాయణ, జర్తా రాజు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ,సీఐటీయూ ప్రజా సంఘాల నాయకులు, జి నానాజి, జి రమేష్, ఎం రమేష్ పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

➡️