రక్తపోటును పరీక్షించుకోవాలి

ర్యాలీ చేపడుతున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-హుకుంపేట: ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఎం అండ్‌ హెచ్‌ఒ జమాల్‌భాష ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అధిక రక్తపోటుతో 30 సంవత్సరాల పైబడి ఉన్న వారంతా బిపి తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. బీపీ ఎక్కువగా ఉంటే ప్రతి నెలా మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ముందుగా పిహెచ్‌ వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లతో ర్యాలీ చేపట్టారు.

➡️