చలివేంద్రం ఏర్పాటు

Apr 13,2024 00:41
ప్రారంభిస్తున్న కార్యదర్శి

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక బస్‌ స్టాప్‌ వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం సర్పంచ్‌ సోమ్మెల రూతు, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రూతు మాట్లాడుతూ, ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో టోపీ ధరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ శెట్టి బాలకృష్ణ, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌, నాగులు, ఉప సర్పంచ్‌ పి.అర్జున్‌, వార్డు మెంబర్‌ చిటం వెంకటరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️