రాకపోకలు ఎలా?

Apr 12,2024 00:11
రాళ్లు తేలిని దారెల గ్రామ రహదారిపై వెళుతున్న దిచక్రవాహనదారుడు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో కిలగాడ ప్రధాన రహదారి నుండి కొత్తులబయలు, దారేల నుంచి పేటమాలిపుట్‌ గ్రామాలకు వెళ్లే రహదారి ఆరు సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో, ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కిలగాడ ప్రధాన రహదారి నుండి కొత్తులబయలు గ్రామం మీదుగా దారేల పంచాయతీ పలు గ్రామాలకు వెళ్లే ఈ రహదారి గుండా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులలో ఈ రహదారి గుండా ప్రయాణం సాగించాలంటే రాలుతేలి ఉండటంతో పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని ద్విచక్ర వాహన దారులు, పాదసారులు తెలిపారు. గత తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు రహదారి మరమ్మతుకు నిధులు మంజూరు చేయక పోవడంతో శిధిలమైన రహదారి మార్గంలో అష్ట కష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు చేపట్టాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

➡️