పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన పిఒ

May 14,2024 00:27
పరిశీలిస్తున్న పిఒ

ప్రజాశక్తి-అరకులోయ:సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతగా ముగిసాయి. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 9గంటలకు 7శాతం, 11 గంటలకు 17.93 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 32.46 శాతం, 3 గంటలకు 51.80 శాతం ఓటింగ్‌ పూర్తయ్యింది. సాయంత్రం నాలుగు గంటలకు 55.85 శాతం నమోదయ్యింది. తుది ఓటింగ్‌ శాతం ప్రకటించాల్సి ఉంది. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 17 మంది అభ్యర్దులు ఎన్నికల బరిలో నిలిచారు. అరకు వ్యాలీ నియోజక వర్గంలో 304 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసారు. 2.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 1.26 లక్షల మంది, పురుషులు 1.19 లక్షల మంది, ధర్డ్‌ జెండర్‌లు ఏడుగురు ఉన్నారు. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ నిరంతరం పోలింగ్‌ సరళిని పర్యవేక్షించి పోలింగ్‌ అధికారులకు పలు సూచనలు చేసారు.

➡️