మన్యంలో మందకొడిగా పోలింగ్‌

May 14,2024 00:23
పోలింగ్‌ ప్రక్రియ ఏడు నుం

ప్రజాశక్తి-పాడేరు: పోలింగ్‌ ప్రక్రియ ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటలు సేపు పూర్తయ్యేసరికి అరకు 7 శాతం, పాడేరు 5.6 శాతం, రంపచోడవరం 7.6శాతం మాత్రమే జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏడు గంటల నుంచి బారులు తీరిన ఓటర్లకు ఎక్కువైంది. మినుములూరు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న మహిళలు పోలింగ్‌ జాప్యం కొంతసేపు కూర్చుంటూ కొంతసేపు నిల్చుంటు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ సమయం పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. జిల్లాలో మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ ఊపందుకుంది. 9 నుంచి 11 గంటల వరకు అరుకు 17.9శాతం, పాడేరు 14.3శాతం, రంపచోడవరం 22 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అరకు 32.46శాతం. పాడేరు 31.38శాతం, రంపచోడవరం 34.43శాతం, సాయంత్రం మూడు గంటల సమయానికి అరకు 51.శాతం, పాడేరు 40.12శాతం, రంపచోడవరం 54.11శాతం పోలింగ్‌ పూర్తయింది. పోలింగ్‌ పూర్తయ్యే సమయానికి అరకు 55. 85శాతం పాడేరు 45.78శాతం, రంపచోడవరం 59.25శాతం కు చేరింది..పోలింగ్‌ కు వరుణుడి అంతరాయం…జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కురిసిన కుండపోత వర్షంతో పోలింగ్‌ కు అంతరాయం కలిగింది. పాడేరు పరిశ్రమ ప్రాంతాల్లో వర్షం ముంచెత్తడంతో మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేకపోయారు. దీని ప్రభావం పోలింగ్‌ పై తీవ్రంగా కనిపించింది. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో పలుసార్లు 55 నుంచి 60 శాతం వరకు పోలింగ్‌ జరిగింది. పాడేరులో పోలింగ్‌ కేవలం 45.78 మాత్రమే జరగడం పట్ల రాజకీయ పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా పది శాతానికి పైగా పోలింగ్‌ తగ్గిపోవడం గమనార్హం.ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ పాడేరు:అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం జరిగిన పోలింగ్‌ సరళి పై జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్‌ యంత్రాంగం పర్యవేక్షణలో కొనసాగింది. జిల్లా కలక్టర్‌ ఎం.విజయ సునీత తన ఓటు హక్కును పాడేరులో వినియోగించుకున్నారు. కలక్టర్‌ బంగ్లాకు సమీపంలో ఉన్న శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం అని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పాడేరు, రంప చోడవరం, అరకు అసెంబ్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనరస తన స్వగ్రామం బొండం పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వేగం మత్స్యలింగం స్వగ్రామం కొంతిలిలోనూ, పాడేరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి తలారిసింగి పోలింగ్‌ కేంద్రం, వైసిపి అభ్యర్థి విశ్వేశ్వర రాజు గుడి వాడ పోలింగ్‌ కేంద్రం, కాంగ్రెస్‌ అభ్యర్థి గొందూరు పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారువెబ్‌ కేస్టింగ్‌ను పరిశీలనకలక్టరేట్‌ జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన వెబ్‌ కేస్టింగ్‌ను సాధారణ పరిశీలకులు కె. వివేకానందన్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలక్టర్‌ ఎం. విజయ సునీత, సబ్‌ కలక్టర్‌ ధాత్రి రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం తనిఖీ జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు కె.వివేకానందన్‌ తనిఖీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌, సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ తదితర అంశాల పై ఆరా తీశారు. బోర్డర్‌ చెక్‌ పోస్టుల వెబ్‌ కాస్టింగ్‌, టివి చానళ్ళను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ బి.పద్మావతి, నోడల్‌ అధికారులు పి.గోవిందరాజులు, పి. రాములు, రమేష్‌ కుమార్‌ రావు, రామకృష్ణ, ఎల్‌.బి. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో వివిధ ప్రాంతాలలో పలువురు పిడబ్ల్యుడి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. పెదబయలు మండలం గొమంగి పోలింగ్‌ కేంద్రములో విభిన్న ప్రతిభావంతుడైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 278వ పోలింగ్‌ కేంద్రములో కొట్టగుల్లి మహేష్‌ బాబు అనే 23 సంవత్సరముల పిడబ్ల్యుడి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలను జేసి సందర్శన పాడేరు రిటర్నింగ్‌ అధికారి జేసి భావన వసిష్ట్‌ జీ. మాడుగుల మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. జీ. మాడుగుల మండలం సెక్టార్‌ 42లో గల 234, 236, 238, 240, 243, 244, 245 నంబర్లు గల పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. వెనుతిరిగిన ఓటర్లు..పాడేరు:పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం రింతాడ గ్రామంలో 29, 30 పోలింగ్‌ బూత్‌ లో ఈవీఎం మిషన్ల సాంకేతిక లోపం, భారీ వర్షం కారణంగా పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6:30 గంటల సమయం దాటిపోవడంతో క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోకుండా ఇళ్లకు వెనుతిరిగి వెళ్ళిపోయినట్లు స్థానికులు తెలిపారు.

➡️