ఘనంగా రంజాన్‌ వేడుకలు

Apr 12,2024 00:12
జి.మాడుగుల మసీదులో ప్రార్థనకు హాజరైన ముస్లిములు

ప్రజాశక్తి-జి.మాడుగుల: స్థానిక మసీదులో రంజాన్‌ వేడుకలను గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు విందును ఏర్పాటు చేశారు. సీలేరు:జికె.వీధి మండలం సీలేరులో ముస్లిములు రంజాన్‌ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మసీదులో కురాన్‌ చదివి అల్లాని స్మరించుకున్నారు. అనంతరం మసీదు దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి అల్లా ఉ అక్బర్‌ అల్లా అంటూ నినాదాలు చేసుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. అమరలైన మహమ్మదీయుల సమాధులపై పుష్పాలు ఉంచి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిములు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

➡️