‘కిలారి’సేవలు మరువలేనివి

Jun 26,2024 19:05
'కిలారి'సేవలు మరువలేనివి

కిలారి వెంకటస్వామి నాయుడుకు నివాళులర్పిస్తున్న దృశ్యం
‘కిలారి’సేవలు మరువలేనివిప్రజాశక్తి-కోవూరు:గ్రంథాలయాల బలోపేతంలో అసామాన్య కృషి సల్పిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కిలారి వెంకటస్వామి నాయుడు చేసిన సేవలు మరువలేనివని శాఖా గ్రంథాలయ అధికారిణి కె.మంజులత అన్నారు. ఆయన ఆకస్మిక మృతి సందర్భంగా బుధవారం బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిష్కలంకులు, సౌమ్యులైన కిలారి వెంకటస్వామి నాయుడు ఆకస్మిక మృతి తీరని లోటన్నారు. పోటీ పరీక్షలు చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు తెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడంలోనూ, వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతం చేయడంలో ఆయన తనదైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం అమర్‌ రహే, అమర్‌ రహే నినాదాలతో బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయ ప్రాంగణం మార్మోగింది. అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. కార్యక్రమంలో జిల్లా రిసోర్స్‌ గ్రూప్‌ సభ్యులు గండికోట సుధీర్‌ కుమార్‌, గ్రంథపాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️